🔴Live Breakings: క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రముఖ టీవీ నటుడు విభూ రాఘవే స్టేజ్ 4 కాలన్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తన నివాసమైన ముంబైలో జూన్ 2న తుదిశ్వాస విడిచారు. విభూ ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ అనే సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన అకాల మరణం అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
ప్రభాస్- డైరెక్టర్ మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆయన పాటలకు సంగీతం కడితే ఎవరైనా పడిపోవాల్సిందే. అది ఎలాంటి మ్యూజిక్ అయినా కూడా సూపర్ బంపర్ హిట్. దాదాపు 50 ఏళ్ళుగా తన మ్యాజిక్ తో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తున్న లయరాజు ఇళయరాజా పుట్టిన రోజు ఈరోజు.
హాట్ బ్యూటీ దిశా పటానీ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
కన్నడ భాషపై కమల్ చేసిన ప్రసంగానికి చప్పట్లు కొట్టినట్లు వస్తున్న వార్తలను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఖండించారు. కమల్ వ్యాఖ్యలకు తాను చప్పట్లు కొట్టలేదని స్పష్టం చేశారు. వేరే స్పీచ్ సమయంలో కొడితే ఎడిటింగ్‌లో అలా చూపిస్తున్నారన్నారు.
స్టార్ హీరో కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు. తన ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కన్నడ భాష వివాదం నేపథ్యంలో కమల్ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేయాలని నిరసనలు వినిపిస్తున్నాయి.
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత AM రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది జూన్ 12న రిలీజ్ కానుంది.
కమెడియన్ అలీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన కావాలని అనలేదు .. అనుకోకుండా అలా మాటతుళ్లిందని తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో దీనిని వైరల్ చేస్తున్నారని... ప్లీజ్ ఇంతటిటితో ఆపేయండి అని స్పష్టం చేశారు.