/rtv/media/media_files/2026/01/14/mega-family-2026-01-14-16-03-10.jpg)
Mega Family
Mega Family: పండగ అంటే కుటుంబమంతా ఒకచోట చేరి ఆనందంగా గడపడం. ఈ విషయం మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే ప్రతి ఏడాది భోగి, సంక్రాంతి పండగలను కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా మెగా కుటుంబం అంతా కలిసి భోగి వేడుకలను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసింది. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోను మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read: ముదిరిన యష్ 'టాక్సిక్' వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన నటి!
Mega Family Sankranthi Celebrations
నిహారిక షేర్ చేసిన వీడియోలో మెగా ఫ్యామిలీ సభ్యులు చాలా సింపుల్‌గా, సంప్రదాయంగా కనిపించారు. ఇంటి వాతావరణంలో అందరూ కలిసి దోశలు వేస్తూ, నవ్వులు పంచుకుంటూ పండగను ఆస్వాదించారు. ఈ వీడియోలో వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, రామ్ చరణ్, సుస్మిత కొణిదెల దోశలు వేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులంతా కలిసి వంట చేసుకోవడం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Also Read: 'ది రాజా సాబ్'పై కుట్ర జరుగుతోంది.. మారుతి షాకింగ్ కామెంట్స్
ఇదే వీడియోలో సాయిధరమ్ తేజ్ టీ, కాఫీ తాగుతూ కనిపించగా, రామ్ చరణ్ సరదాగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఈ చిన్న చిన్న క్షణాలు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపించాయి. పెద్ద స్టార్ కుటుంబం అయినా, పండగ రోజు మాత్రం అందరూ సాధారణ కుటుంబంలా కలిసి ఉండటం అభిమానులను మరింత ఆకట్టుకుంది.
Also Read: దీపికా దారిలోనే రాధికా.. షూటింగ్ చేయాలంటే కండిషన్స్ అప్లై..!
ఈ వీడియోకి నిహారిక ఒక సరదా క్యాప్షన్ కూడా ఇచ్చింది. “ఇది భోగిలా లేదు, దోశల రోజు లా ఉంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మా కుటుంబమంతా ఒకచోట చేరి మన సంప్రదాయాలను పాటిస్తూ పండగ జరుపుకోవడం” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ మాటలు చూసి మెగా అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత ఆనందానికి మరో కారణం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి, పండగ మొదలయ్యేలోపే సుమారు రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
Also Read: సంక్రాంతి స్పెషల్.. దోశలు వేసిన మెగా హీరోలు.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ భారీ విజయంతో చిత్రబృందం అంతా ఆనందంలో మునిగిపోయింది.
ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిరంజీవి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఘనంగా పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీకి ఈ భోగి, సంక్రాంతి పండగ మరింత ప్రత్యేకంగా మారింది.
Follow Us