/rtv/media/media_files/2025/05/06/AbodT8rV5GwAlpaBi5xj.jpg)
Suhas Mandaadi First Look
Suhas in Mandaadi: తెలుగు ఆడియన్స్ ను తన విభిన్న పాత్రలతో ఆకట్టుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్.. చిన్న నిర్మాతలకు నూతన దర్శకులకు ప్రాధాన్యత ఇస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘మండాడి’ అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రం ద్వారా కోలీవుడ్ ఆడియెన్స్‌ను పలకరించనున్నాడు.
Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!
ఈ చిత్రంలో తమిళ నటుడు సూరి(Tamil Actor Soori) కీలక పాత్రలో నటిస్తున్నాడు. కథకు బలమైన ప్రత్యేకత ఉండటంతో, తెలుగులో మంచి నటనతో మెప్పిస్తున్నసుహాస్‌ను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే విడుదలైన సుహాస్ లుక్ పోస్టర్(Mandaadi First Look) అందరిని ఆకట్టుకుంటోంది. సుహాస్ కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుందనే నమ్మకం అభిమానుల మధ్య నెలకొంది.
ఈ సినిమాలో సుహాస్ "సునామీ రైడర్స్"(Tsunami Raiders) టీమ్‌కు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. అయితే సుహాస్ పాత్ర హీరోనా , విలనా అన్నది ప్రస్తుతం చిత్ర యూనిట్ సీక్రెట్ గా ఉంచింది.
Here is the first look of #Mandaadi
— Suhas 📸 (@ActorSuhas) May 5, 2025
Can't wait to ride and rule the sea with @sooriofficial Anna 🤗🌊@elredkumar @rsinfotainment #VetriMaaran @MathiMaaran @gvprakash @Mahima_Nambiar #Achyuthkumar @RavindraVijay1 #Sathyaraj pic.twitter.com/ZLUSKisaHe
Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే
సుహాస్.. ‘రా’, ‘రస్టిక్’ టచ్..
ఈ సినిమాకు ప్రముఖ దర్శక నిర్మాత వెట్రిమారన్(Vetrimaaran) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన ‘రా’ , ‘రస్టిక్’ టచ్ ఈ సినిమాకు కూడా ప్రధానంగా ఉండనుందని సమాచారం. కథ, సన్నివేశాలు, పాత్రలు అన్ని కలిపి ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా(Emotional Sports Drama) అనిపించేలా ఉండబోతుంది.
మంచి టెక్నికల్ టీంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఎస్.ఆర్. కార్తీక్ తీసుకున్నారు. ఈ సినిమాకు మట్రిమారన్ పుకజ్‌హిందీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక సుహాస్ తెలుగులో నటించిన మరో చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’(O Bhama Ayyo Rama) కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వరుసగా భిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్, ఈసారి తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.