/rtv/media/media_files/2025/09/23/og-title-trolls-2025-09-23-15-14-12.jpg)
OG Title Trolls
OG Title Trolls: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో అభిమానుల్లో మంచి జోష్ ని నింపింది. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ స్టైల్, యాక్షన్, మాస్ డైలాగ్స్ చూసినవారు "వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు" అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే, ఈ సినిమా సెన్సార్ దశను పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘OG’ కు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ (18 ఏళ్ల పైబడినవారికే అనుమతి) ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ‘పంజా’ తర్వాత రెండవ ‘A’ సర్టిఫికేట్ పొందిన చిత్రం కావడం విశేషం.
ముందుగా చిత్ర బృందం U/A సర్టిఫికేట్ కోసం ట్రై చేసినప్పటికీ, సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్ పై కట్స్ సూచించడంతో మేకర్స్ మాస్ ఎఫెక్ట్ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో 'A' సర్టిఫికేట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
OG టైటిల్‌పై రాజకీయ విమర్శలు (YCP Trolls on OG Title)
ఇక సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో OG టైటిల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ టైటిల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. "OG అంటే ‘ఒంటరిగా గెలవలేనోడు’" అంటూ పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/09/23/og-title-trolls-2025-09-23-15-17-07.jpg)
పవన్ ఇప్పటివరకు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో గెలవలేకపోయారని, ప్రతి సారి కూటముల్లో భాగంగా మాత్రమే పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2014లో జనసేన ప్రారంభించినా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా గెలిచారు కానీ అది ఒంటరిగా గెలిచిన విజయమేమీ కాదని వైసీపీ వాదిస్తోంది.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
అభిమానుల కౌంటర్
ఇక జనసేన, పవన్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సినిమా టైటిల్‌ను రాజకీయంగా వాడటం సరైనది కాదని స్పష్టం చేస్తున్నారు. “పవన్ ఒంటరిగా కాదు, ప్రజలతో కలిసి గెలవాలనుకుంటున్న నేత” అని పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆయన నాయకత్వం మీద విమర్శలు తగవని అంటున్నారు.
OG సినిమాకు ఇప్పటికే మంచి హైప్ ఉండగా, రాజకీయ వ్యంగ్యాల వల్ల ప్రచారం ఇంకాస్త పెరుగుతోందన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న OG ట్రైలర్, పవన్ మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లలో OG మేనియా అదిరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
సినిమా పరంగా ‘OG’ మంచి అంచనాలు అందుకుంటుండగా, టైటిల్‌ను రాజకీయంగా లాగడం హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇది OG సినిమాకు మరింత ప్రచారం తీసుకువస్తుందా లేక నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందా అనేది ఇంకో రెండు రోజుల్లో తేలనుంది. అయితే ఓ విషయమైతే నిజం… OGతో పవన్ మళ్లీ గ్రాండ్ మాస్ ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి.
Follow Us