Vivek Oberoi: “భవిష్యత్తులో షారుఖ్ ఖాన్ ఎవరో కూడా తెలీదు” స్పిరిట్ నటుడు షాకింగ్ కామెంట్స్..

స్పిరిట్ నటుడు వివేక్ ఓబెరాయ్, భవిష్యత్తులో కొత్త తరాలు షారుఖ్ ఖాన్ ను కూడా గుర్తు పెట్టుకోకపోవచ్చని వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు అభిమానులు వ్యతిరేకం వెలిబుచ్చగా, మరికొందరు ఆయన మాటల్లో తప్పు లేదని అంటున్నారు.

New Update
Vivek Oberoi

Vivek Oberoi

Vivek Oberoi: సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit Movie) లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, బీ టౌన్ కింగ్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో వచ్చే కొత్త తరాలకు షారుఖ్ ఖాన్ పేరు కూడా తెలియకపోవచ్చని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది.

Vivek Oberoi Shocking Comments on Shah Rukh Khan

ఇటీవల పింక్ విల్లా ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్, ఈ జనరేషన్‌కి గత కాలం స్టార్ హీరోల గురించి పెద్దగా తెలియదని అన్నారు. నేటి పిల్లలు 1960లలో వచ్చిన సినిమాల గురించి, అప్పటి సూపర్‌స్టార్స్ గురించి కూడా తెలియదని ఆయన ఉదాహరణ చెప్పారు. "ఇప్పటి పిల్లలకు రాజ్ కపూర్ ఎవరో కూడా తెలియదు. ఇదే విధంగా 2050లో పిల్లలు కూడా ‘షారుఖ్ ఖాన్ ఎవరు?’ అని అడిగే రోజులు రావచ్చు" అని వివేక్ చెప్పాడు.

“మనమంతా షారుఖ్ ఖాన్ ను సినిమాల దేవుడిలా మాట్లాడతాం. కానీ రణబీర్ కపూర్ అభిమానిగా ఉన్న ఒక యువకుడిని అడిగితే, అతనికి రాజ్ కపూర్ ఎవరని కూడా తెలియకపోవచ్చు. కాలం మారుతుంది… చరిత్రలో మనం అందరం ఒక దశలో మాయం అయిపోతాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ మాటలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం వివేక్‌ను సపోర్ట్ చేస్తూ, “అతను ఉదాహరణకు షారుఖ్ ఖాన్ పేరు మాత్రమే చెప్పాడు. దాంట్లో నెగటివ్ లేదా దూషణ ఏమీ లేదు. చెప్పింది నిజమే” అంటూ స్పందిస్తున్నారు.

ప్రస్తుతం వివేక్ ఓబెరాయ్ తన కొత్త సినిమా ‘మస్తీ 4’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. రితేష్ దేశ్‌ముఖ్, ఆఫ్తాబ్ శివదాసానీతో కలిసి నటించిన ఈ సినిమా మస్తీ ఫ్రాంచైజ్‌లో నాల్గవ భాగం. ఈరోజు థియేటర్లలో విడుదలవుతోంది.

వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు షారూఖ్ అభిమానుల్లో అసంతృప్తి రేపినా, మరోవైపు ప్రేక్షకుల మధ్య ఆసక్తికరమైన చర్చను కూడా ప్రారంభించాయి, కాలం మారుతున్న కొద్దీ స్టార్‌ల గుర్తింపు కూడా మారిపోతుందా? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు