Vishwambhara : 'విశ్వంభర' టీజర్ కు డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు.

author-image
By Anil Kumar
New Update
chiru

Vishwambhara Movie Teaser :

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి టీజర్‌ ఎప్పుడొస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీజర్ పై అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌ 12న దసరా పర్వదినం సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రేక్షకులకు విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు.

Also Read :  నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ సందేశాలకు స్పందించకండి : నయనతార

వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. త్రిష మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్‌ గా కనిపించనుంది. మెగాస్టార్ చెల్లెళ్ళుగా పలువురు టాలీవుడ్ భామలు సందడి చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు