నా సినిమా బాలేకపోతే థియేటర్ కు రాకండి.. విశ్వక్ సేన్ ఓపెన్ ఛాలెంజ్

విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమా ట్రైలర్ లాంచ్ లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. సినిమాపై తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, రిలీజ్ కు ముందు రోజే పెయిడ్ ప్రివ్యూ వేస్తానని, అది చూసిన వాళ్ళు సినిమా బాలేదని చెప్తే రిలీజ్ రోజు థియేటర్ కు రావొద్దని అన్నాడు.

New Update

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న ట్రైలర్‌ను మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం హీరో విశ్వక్ సేన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా..

ఈ సినిమా నచ్చకపోతే థియేటర్ కు రాకండి అంటూ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఈ మేరకు విశ్వక్ మాట్లాడుతూ.."  చాలా మంది ఈ చిత్రానికి బజ్‌ లేదంటున్నారు. నిజం చెప్పాలంటే నేనే ఇప్పటి వరకూ బజ్ ఇవ్వలేదు. సినిమా మొన్న చూసుకునోవడం జరిగింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఎంత కాన్ఫిడెంట్ అంటే 22 సినిమా రిలీజ్. 21 రాత్రి 7:30 గంటలకు పెయిడ్ ప్రివ్యూ వేస్తాం.

Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. వైరల్ అవుతున్న ప్రోమో

 చూసినోడు సినిమా బాలేదంటే 22 న థియేటర్ కి రాకండి. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ మొత్తం సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తారు. ఇక క్లైమాక్స్ అయితే రెండో సారి సినిమా చూసేంత రేంజ్ లో ఉంది.." అంటూ చెప్పుకొచ్చాడు. విశ్వక్ కామెంట్స్ విన్న కొందరు నెటిజన్స్ ఇది మరీ ఓవర్ అయిందని, సినిమాపై కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అంటున్నారు. 

నిజానికి గతంలోనూ విశ్వక్ తన సినిమాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఈసారి కూడా దాన్ని రిపీట్ చేశాడు. మరి మాస్ కా దాస్ చెప్పినట్లు 'మెకానిక్ రాకీ' ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుందా?లేదా? అనేది చూడాలి. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. 

Also Read : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు?

#actor-vishwak-sen #mechanic-rocky
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe