Vijay’s Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’ రిలీజ్ డౌటే.. కారణం అదేనా..?

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయకన్’ జనవరి 9, 2026న విడుదల కావాల్సి ఉంది, రాజకీయ సభలో జరిగిన స్టాంపీడ్ ఘటన, ప్రభుత్వంతో విభేదాలు కారణంగా విడుదలపై క్లారిటీ లేదు. ప్రమోషన్లు తాత్కాలికంగా ఆపేశారు. సినిమా విజయ్ రాజకీయ ప్రయాణానికి కీలకంగా మారనుంది.

New Update
Vijay’s Jana Nayagan

Vijay’s Jana Nayagan

Vijay’s Jana Nayagan: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించి, తన చివరి సినిమా ‘జన నాయకన్’ షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ ఇప్పటికే జనవరి 9, 2026న సినిమాను విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ విడుదలపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.

తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) నిర్వహించిన సభలో జరిగిన స్టాంపీడ్ ఘటన వల్ల విజయ్ పూర్తిగా దిగులుకు గురయ్యారు. ఈ ఘటనలో కొన్ని అమూల్యమైన ప్రాణాలు పోవడం, ఆ తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు రావడం వల్ల విజయ్ మానసికంగా కాస్త దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు తమిళనాడు ప్రభుత్వంతో ఆయనకు తలెత్తిన వివాదం సమస్యను మరింత పెంచింది.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

ఈ పరిస్థితుల్లో విజయ్ తన సినిమాపై(Vijay’s Jana Nayagan) దృష్టి పెట్టలేకపోతున్నారు. తాను ప్రమోషన్స్ చేపడితే, ప్రజల కోపానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. “జన నాయకన్”ని ప్రమోట్ చేస్తూ కనిపిస్తే, ప్రజల బాధలను పట్టించుకోకుండా సినిమా కోసం పరితపిస్తున్నాడనే విమర్శలు రావచ్చు.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

జనవరి విడుదల అసాధ్యమా?

KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు మొదలుపెట్టాలనే ప్లాన్ ఉన్నా, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. విజయ్ రాజకీయంగా ఎలా ముందుకెళ్తారు, ప్రజల్లో ఫీలింగ్ ఏంటన్న దానిపై ఆధారపడి సినిమా ప్రచార కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమా విజయ్ రాజకీయ జీవితంలో కీలక మలుపు కావచ్చు. అంతేకాదు, ఈ సినిమా కథ కూడా విజయ్ రాజకీయ ఆలోచనలకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని సమాచారం. అందుకే విజయ్ కోసం ఈ సినిమా విజయం చాలా అవసరం.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

దీపావళికి ప్రమోషన్ స్టార్ట్?

మూవీ యూనిట్ దీపావళి సమయంలో గ్రాండ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. కానీ విజయ్ చుట్టూ ఉన్న పరిస్థితులు స్పష్టంగా లేకపోవడంతో, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అభిమానులు కూడా ఈ సినిమాపై ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఉన్నారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

‘జన నాయకన్’ విజయ్ సినీ జీవితానికి ముగింపు కావొచ్చు, కానీ అదే సినిమాతో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల్లో సినిమా రిలీజ్ పైనే సందేహాలు తలెత్తుతున్నాయి. విజయ్ ఈ సమస్యల్ని అధిగమించి సినిమాను సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి!

Advertisment
తాజా కథనాలు