/rtv/media/media_files/uWxGdQrnHGI2wyXZImWM.jpg)
SSMB29: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'SSMB29'. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.
జనవరిలో మొదలు..
దీనిపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. 'మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన. 'SSMB29' షూటింగ్ గురించి మాట్లాడారు. జనవరి నుంచి మహేశ్ - రాజమౌళి మూవీ షూట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#SSMB29 - Shoot Starts From January 2025🔥🔥🔥
— South Digital Media (@SDM_official1) October 9, 2024
- #VijayendraPrasad#MaheshBabu𓃵@urstrulyMaheshpic.twitter.com/dRgqfmHVm1
Also Read : చిరంజీవి పరమ దుర్మార్గుడు.. జేడీ చక్రవర్తి వీడియో వైరల్
ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాతో రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
"Intha varuku Eega tho doomatho tisadu" statement justified#SSMB29@urstrulyMaheshpic.twitter.com/6Vw7N7RF2e
— Zunaid18 (@Maheshians4) October 9, 2024
యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరికొత్త కొత్త లుక్ లో కనిపించనున్న ఈ సినిమాను నిర్మాత కె.ఎల్. నారాయణ సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.