Sir Madam Trailer: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన 'సర్ మేడం' ట్రైలర్ విడుదలైంది. ఇందులో భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో సేతుపతి, నిత్యామీనన్ హాస్యం, సహజమైన నటన ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. వినోదంతో పాటు భార్యాభర్తల బంధం గురించి మంచి సామజిక సందేశనిచ్చే కథగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ఈ కథను రూపొందించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా
#Sirmadam
— VijaySethupathi (@VijaySethuOffl) July 17, 2025
Trailer out now!!https://t.co/Q5VMvAzSQD#SirmadamFromJuly25@MenenNithya@pandiraaj_dir@Music_Santhosh@PradeepERagav@studio9_suresh@mynnasukumar@thinkmusicindia@SathyaJyothipic.twitter.com/zzsjCmAMyh
ఈనెల 25న విడుదల
సత్యజ్యోతి ఫిల్మ్స్, TG త్యాగరాజన్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈనెల 25న ఈ చిత్రం తమిళ్, కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇందులో కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రను పోషించారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు