Vijay Devarakonda - Rashmika: త్వరలో ఒక్కటి కానున్న విజయ్- రష్మిక.. ఇదిగో ప్రూఫ్..!

విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో త్వరలో ఓ కొత్త సినిమా రానుంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా మెరవబోతున్నట్టు తెలుస్తోంది. “కింగ్డమ్” తర్వాత ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

New Update
Vijay Devarakonda - Rashmika

Vijay Devarakonda - Rashmika

Vijay Devarakonda - Rashmika: ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టంతా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా “కింగ్డమ్”(Kingdom) పైనే ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, దీని తరువాత విజయ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!

రెండోసారి జోడీ..

ఈ సారి విజయ్, ట్యాక్సీవాలా సినిమాతో సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో మరోసారి చేతులు కలపనున్నాడు. రెండోసారి ఈ జోడీ కలిసి చేసే సినిమా పై కూడా మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా విషయాలను గమనిస్తే, ఇది ఒక విభిన్నమైన కథాంశంతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మెరవబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, దర్శకుడు, నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దింతో ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తునట్టు తెలుస్తోంది.

ఇక ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతుందన్న వార్తతో అభిమానుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు