Vijay Deverakonda: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటించే కొత్త చిత్రం అధికారికంగా కన్ఫర్మ్ అయింది. రవి కిరణ్ కోల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ వారం పూజా కార్యక్రమంతో ప్రారంభంకానుంది.

New Update
Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రెడీ అయింది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేష్(Keerthy Suresh) తాజాగా జతకట్టబోతున్నారన్న వార్తకు తాజాగా అధికారికంగా కాన్ఫర్మషన్ వచ్చింది.

రవి కిరణ్ కోల డైరెక్షన్ లో ఈ జోడి మెరవనున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరికి ఈ జోడీపై వస్తున్న గాసిప్స్ నిజమేనని తాజాగా తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ కానుంది.

Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?

క్లాస్, మాస్ కాంబో.. 

విజయ్ దేవరకొండ అంటే యూత్‌ఫుల్ యాక్షన్, స్టైల్‌కు ఓ సింబల్. కీర్తి సురేష్ తన ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన నటి. వీరిద్దరూ తొలిసారి ఒకే సినిమాలో జోడీగా నటించబోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్.. 

ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండనున్నాయని టాక్. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, ఇది ఓ కొత్త కథ అని సమాచారం. దర్శకుడు రవి కిరణ్ కోల గతంలో చేసిన సినిమాల వల్ల ఈ సినిమా మరింత ఆసక్తికరంగా మారింది.

Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!

చిత్రబృందం ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేందుకు ఈ వారం లోపే పూజా కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. గతంలో విజయ్ దేవరకొండ ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు మళ్లీ పక్కా ఫ్యామిలీ-రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

మొత్తానికి, విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జోడీ, రవి కిరణ్ కోల దర్శకత్వంలో రూపొందే ఈ కొత్త సినిమా త్వరలో లాంచ్ కాబోతుంది. రొమాన్స్, ఫీల్-గుడ్ ఎమోషన్ కలగలిసిన కథతో ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు