Kingdom: విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కింగ్డమ్' మరో 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. స్పై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేశాయి. దానికి తగ్గట్లుగానే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. sacnilk నివేదిక ప్రకారం ప్రీ సేల్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 13 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలం విడుదలైన సినిమాల్లో ఇది అతి పెద్ద ప్రీ సేల్ అని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఇందులో రూ. 5 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని సమాచారం. ప్రీ సేల్స్, ప్రీమియర్ షోలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.18- 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
Every centre has become a part of #Kingdom’s fever 🔥🔥🔥
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
It’s a BOX OFFICE CELEBRATION with record breaking bookings all over the world 💥💥💥
🎟️ - https://t.co/4rCYFkA5dI#KingdomOnJuly31st@TheDeverakonda@anirudhofficial@gowtam19@ActorSatyaDev#BhagyashriBorse… pic.twitter.com/Om6Oaj9ttH
కింగ్డమ్ హిట్..
'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ చాలా సినిమాలు చేసినప్పటికీ.. ఆ సినిమా ఇచ్చినంత సక్సెస్, స్టార్ డమ్ విజయ్ కి రాలేదు. మధ్యలో 'గీతా గోవిందం' భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ 'అర్జున్ రెడ్డి' లాంటి ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు 'కింగ్డమ్' విజయ్ కి మళ్ళీ ఆ సక్సెస్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. గ్యాంగ్ స్టార్, బ్రదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విజయ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, బీజీఎమ్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజయ్ ని ఒక కొత్త యాంగిల్ లో చూడబోతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో భాగ్య శ్రీ కథానాయికగా నటించగా.. సత్యదేవ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మహేష్ ఆచంటా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా చూసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..కింగ్డమ్ పక్కా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో విజయ్ మొత్తం నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని, జైలు ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. దీంతో ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సందీప్ రెడ్డి వంగా- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో విజయ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదిగాడు.
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్