Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్టుగా ఊహించని స్టార్ హీరో! నాగార్జున గుడ్ బై

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 9 హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
vijay devarakonda as bigg boss host

vijay devarakonda as bigg boss host

Bigg Boss 9: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9వ సీజన్ కి సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న సీజన్ 9.. గత సీజన్స్ తో పోలిస్తే మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు. ఇప్పటికే మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

vijay
vijay

 

 హోస్టుగా విజయ్ దేవరకొండ

సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్ చేయగా.. మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే సీజన్ 9 హోస్టుగా మరో యంగ్ హీరో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 9 హోస్టింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, దీనికి సంబంధించి బిగ్ బాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే విజయ్ హోస్ట్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే..  బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ ట్రోఫీ గెలుచుకున్నాడు. వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. 

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు