Vijay Antony: 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మార్గన్' జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేమని అన్నారు. తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని, అలాగే రాజకీయాల్లోకి అడుపెట్టే ఉద్దేశమూ తనకు లేదని స్పష్టం చేశారు.
ఆ ఉద్దేశం లేదు!
నటీనటులు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే రూలేమి లేదు! ఒకవేళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినా.. వారికి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటేనే అధికారంలోకి రాగలరు అని అన్నారు. రాజకీయాల్లో రావాలంటే ముందుగా ప్రజల సమస్యలను అర్థమా చేసుకోగలగాలి అని తెలిపారు. దీంతో విజయ్ ఆంటోనికి పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.
பஸ் யாத்திரை with #MAARGAN 😈
— vijayantony (@vijayantony) June 25, 2025
2 days to go #MaarganFromJune27pic.twitter.com/1BRKA7v6ST
ఇదిలా ఉంటే క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'మార్గన్' చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ, అజయ్ ధిషన్, పి. సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే సంగీతం కూడా ఆయనే అందించారు.
ఈ సినిమా తర్వాత మరో 4 లైనప్ సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ ఆంటోనీ. వల్లి మయిల్, అగ్ని సిరగుగల్, ఖాఖీ, శక్తి తిరుమగన్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
Also Read:Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్