Vijay Antony Bhadrakali Movie: విజ‌య్ ఆంటోని బర్త్ డే స్పెషల్.. కేక్ కి బదులు ఏం కట్ చేశారో చూడండి..!

విజయ్ ఆంటోనీ 25వ సినిమా ‘భద్రకాళి’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌కు అద్భుత స్పందన వచ్చింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో బిర్యానీ కట్ చేస్తూ విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడం వైరల్ గా మారింది.

New Update
Vijay Antony Bhadrakali Movie

Vijay Antony Bhadrakali Movie

Vijay Antony Bhadrakali Movie: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'మార్గన్' మూవీ(Maargan Movie) సూపర్ డూపర్ హిట్ అందుకుంది. విజ‌య్ ఇప్పుడు తన 25వ సినిమా అయిన ‘భద్రకాళి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ చిత్రానికి అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అరువి’, ‘వాళ్’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అరుణ్, ఈసారి విజయ్ ఆంటోనీతో కలిసి ఈ కథను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించబోతున్నారు.

టీజర్‌కు అద్భుత స్పందన.. 

ఇప్పటికే విడుదలైన ‘భద్రకాళి’ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌, ఇన్వెస్టిగేటివ్ థీమ్‌ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓ భారీ కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతోంది.

Also Read:ఛీ.. వీడు తండ్రేనా.. కన్న కూతురుపై శాడిజం! కాలితో తన్నుతూ చిత్రహింసలు!

హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ - బిర్యానీ కట్ చేసిన విజయ్!

తాజాగా హైదరాబాద్‌లో ‘భద్రకాళి’ ప్రోమోషనల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సందర్భంలో విజయ్ ఆంటోనీ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు.

అయితే ఈ వేడుకలో ఒక ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఉంది! రొటీన్ గా కేక్ కట్ చేయడం బదులు, విజయ్ బిర్యానీని కట్ చేస్తూ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. ఇది చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “కేక్‌ ప్లేస్‌లో బిర్యానీ ఏంటి?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

‘భద్రకాళి’ విడుదల తేదీ.. 

సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ అన్ని కలగలిపిన ‘భద్రకాళి’ సినిమా 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ 25వ సినిమా కావడంతో ఆయన అభిమానులకు ఇది ఒక స్పెషల్ మూవీ అవ్వనుంది.

Advertisment
తాజా కథనాలు