/rtv/media/media_files/2025/11/19/tulasi-2025-11-19-11-23-27.jpg)
నటి తులసి ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచినటనకు అధికారికంగా రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ ద్వారా తెలిపారు. రిటైర్‌మెంట్ తర్వాత తన జీవితాన్ని షిరిడీ సాయిబాబా సేవకు అంకితం చేస్తానని, ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. తులసి మూడున్నర నెలల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె దాదాపు 58 సంవత్సరాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి వంటి పలు భాషల్లో 300కు పైగా చిత్రాల్లో బాలనటిగా, కథానాయికగా, ఆ తర్వాత తల్లి పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
I will miss u tulasi gaaru in movies
— Teddy🤍💚 (@Teddy_bear_BW) November 19, 2025
Good luck to ur spiritual journey https://t.co/0sWcP1wgki
ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్
ఎన్నో సినిమాల్లో చాలా మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించి ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ ను దక్కించుకున్న తులసి కొన్నాళ్ల నుంచే సినిమాలు తక్కువగా చేస్తూ వచ్చింది. నటనకు ఆమె గుడ్‌బై చెప్పడంపై సినీ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ఆమె భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తులసి 1998లో ప్రముఖ కన్నడ దర్శకుడు శివమణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు (సాయి తరుణ్) ఉన్నారు.
Follow Us