/rtv/media/media_files/2025/04/16/c1Ce0w3qyKV35cSL0nMb.jpg)
Venkatesh In Mega 157
Venkatesh In Mega 157: ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్న వెంకటేశ్, వచ్చే పండుగ సీజన్‌కూ మళ్ళీ థియేటర్లలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ పై మెరిసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోదానికి తోడు భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతానికి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
వెంకటేశ్ కీలక పాత్రలో..
తాజా సమాచారం మేరకు వెంకటేశ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. అతిథి పాత్రలో చిరుతో పాటు స్క్రీన్‌ను షేర్ చేసుకునే రోల్ అని చెబుతున్నారు. ఈ క్యారెక్టర్ కథలో మైలురాయిగా నిలిచే విధంగా ఉంటుందని సమాచారం.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించే అవకాశాలున్నాయి. సంక్రాంతి 2026కి ఈ మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, కెమెరామెన్‌గా సమీర్ రెడ్డి పనిచేస్తున్నారు. వెంకటేశ్ – చిరంజీవి కలయికలో వస్తున్న ఈ క్రేజీ మూవీపై మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వడం మర్చిపోకండి!
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..