Val Kilmer: న్యుమోనియా సమస్యతో ప్రముఖ నటుడు కన్నుమూత!

ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూశారు. న్యుమోనియా సమస్యతో ఆయన మరణించినట్లు కుమార్తె మర్సిడిస్ కిల్మర్ తెలిపారు. 'ది డోర్స్', 'బ్యాట్మన్ ఫోరెవర్' టాప్ గన్', 'రియల్ జీనియస్' వంటి చిత్రాలతో వాల్ కిల్మర్ గుర్తింపు పొందారు.

New Update
val kilmer passed away

val kilmer passed away

Val Kilmer:  హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ 65 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. మంగళవారం తమ నివాసమైన లాస్ ఏంజిల్స్ లో కన్నుమూశారు. తీవ్రమైన న్యుమోనియా సమస్య ఆయన మరణానికి కారణమని కూతురు మర్సిడిస్ కిల్మర్  తెలిపారు. అయితే 2014లో కిల్మర్ కు గొంతు క్యాన్సర్ నిర్దారణ అవగా.. ఆయన దాని నుంచి పోరాడి కోలుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన న్యుమోనియా సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. 

గ్రామీ అవార్డు.. 

కిల్మర్  1984లో 'టాప్ సీక్రెట్' అనే ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 'టాప్ గన్', 'రియల్ జీనియస్', 'విలో', 'హీట్',  'ది సెంట్',  ది డోర్స్', 'బ్యాట్మన్ ఫోరెవర్', 'రియల్ జీనియస్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  రాబర్ట్ డౌనీ జూనియర్, డెన్జెల్ వాషింగ్‌టన్ వంటి ప్రముఖ నటీనటులతో వాల్ కలిసి పనిచేశారు.  'జోర్రో' చిత్రంలో తన స్పోకెన్ వర్క్ కోసం గ్రామీ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు. 1991లో 'ది డోర్స్' చిత్రంలో సింగర్ మోరిసన్ పాత్ర కిల్మర్  కెరీర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన పాత్రగా చెబుతారు. అంతేకాదు ఆ సినిమాలోని కాస్ట్యూమ్ స్టైల్ ని ఆయన ఒక సంవత్సరం వరకు ధరించారని పలు నివేదికలు తెలిపాయి. 

ఓ నివేదిక ప్రకారం.. 2021లో  కిల్మర్ థ్రోట్ కేన్సర్ కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ..  'టాప్ గన్: మావెరిక్' చిత్రంలో నటించేందుకు నిర్ణయించుకున్నారు. అదే ఏడాది అయన జీవిత కథ ఆధారంగా  'వాల్' అనే డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో ఆయన కుమారుడు వాల్ కిల్మర్ పాత్రకు వాయిస్ అందించారు.  వాల్ కిల్మర్ లాస్ ఏంజిల్స్ లో జన్మించారు. యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టె ముందు వాల్ హాలీవుడ్ ప్రొఫెషనల్ స్కూల్ జూలియార్డ్ స్కూల్ లో శిక్షణ పొందారు. వాల్ అనేక యానిమేటెడ్ చిత్రాలకు వాయిస్ ఓవర్ కూడా అందించారు. వాటిలో 'ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్' ఒకటి.

Also Read: Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్

Advertisment
తాజా కథనాలు