Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'Adolescence'ను UKలోని అన్నిసెకండరీ పాఠశాలలో ప్రదర్శించాలని ప్రకటించారు. ప్రమాదకర ఆన్‌లైన్ కంటెంట్‌ వల్ల వచ్చే ఇబ్బందులు, పిల్లల పై ఇవి చూపే ప్రభావం వంటి అంశాలను ఈ సీరీస్ లో చూపించారు.

New Update

Adolescence:  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ రూపొందించిన  'Adolescence' సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ప్రేక్షకుల నుంచి 
భారతదేశంలోని  సినీతారల వరకు అంతా దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. యూకే ప్రధాని సైతం ఈ సీరీస్ లోని సున్నితమైన కంటెంట్ ని అభినందించారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తోంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో సహా అన్ని వయసుల వారు తప్పక చూడాల్సిన సీరీస్ గా చెబుతున్నారు. 

సెకండరీ పాఠశాలల్లో 'Adolescence' 

ఈ క్రమంలో యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్  యూకేలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో ఈ సీరీస్ ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అన్ని పాఠశాలలో ఉచితంగా ప్రదర్శించేందుకు నెట్ ఫ్లిక్స్ చొరవ తీసుకోవాలని అయన కోరారు. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు సీరీస్ చూసే అవకాశం కలుగుతుందని తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధాని స్టార్మర్‌ మాట్లాడుతూ.. అన్ని పాఠశాలలో ఈ సిరీస్ ని ప్రదర్శించడం ద్వారా.. మహిళల పట్ల ద్వేషభావం మంచిది  కాదని,  ప్రమాదకర ఆన్ లైన్ కంటెంట్ వల్ల కలిగే ఇబ్బందులు, తోటి విద్యార్థులతో, వ్యక్తులతో  మంచి సంబంధాలను ఎలా కొనసాగించాలి వంటి విషయాలు గురించి పిల్లలు తెలుసుకుంటారని చెప్పారు. 

Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?

టీనేజ్ యువతపై ఫోకస్ చేస్తూ.. 

టీనేజ్ యువత పై సోషల్ మీడియా ప్రభావం, పిల్లలు ఇంటర్నెట్ లో ఏం వెతుకుతున్నారు? వాళ్ళ స్కూల్ లో ఏం జరుగుతుంది? క్లాస్ రూమ్ లో వారి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది? వాళ్ళను చెడు మార్గం వైపు ప్రభావితం చేస్తున్న అంశాలేటి..? ఇలాంటి అనేక ప్రశ్నలకు తెరలేపేలా ఈ సీరీస్ కొనసాగుతుంది. 

latest-news | Adolescence series

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు