CID ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ACP ప్రద్యుమన్ ఇక లేరు!

'CID' షో పెద్ద మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం రాబోయే ఎపిసోడ్ లోACP ప్రద్యుమన్ పాత్ర ఓ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుందట. దీంతో CID అభిమానులను షాక్ కి గురవుతున్నారు. ప్రముఖ నటుడు శివాజీ సతం ACP ప్రద్యుమన్ పాత్రను పోషించారు.

New Update

CID: భారతీయ టెలివిజన్ షోలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోలలో 'CID' ఒకటి. రాత్రి 9 అవగానే చాలా మంది టీవీల ముందు కూర్చొని ఎంతో ఇంట్రెస్టింగ్ గా 'CID' చూస్తుంటారు. అయితే తాజా నివేదికల ప్రకారం ఈ షోలో పెద్ద  ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ACP ప్రద్యుమన్ పాత్రను ముగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎపిసోడ్ లోACP ప్రద్యుమన్ పాత్ర ఓ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుందట. 

ACP ప్రద్యుమాన్ పాత్రకు ముగింపు 

అయితే CID బృందాన్ని ఓడించడానికి విలన్  బార్బోసా ( టిగ్మాన్షు ధులియా ) బాంబు పెడతాడు. ఈ బ్లాస్ట్ లో CID బృందానికి చెందిన ఇతర సభ్యులంతా రక్షించబడగా.. ACP ప్రద్యుమాన్ మరణిస్తారట. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిత్రీకరణ పూర్తవగా.. మరి కొన్ని రోజుల్లో ప్రసారం అవుతుందని సమాచారం. CIDబృందం నాయకుడిగా ప్రద్యుమన్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. షోను ఆయన కోసం మాత్రమే  చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది ఇకపై ఆయన పాత్ర ఉండదనే వార్త ప్రస్తుతం అభిమానులను షాక్ కి గురిచేస్తోంది. 

అయితే గతంలో కూడా ఈ షోలో చాలా పాత్రలు చనిపోయినట్లుగా చూపించారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాయి.  మరి ACPని కూడా అలా  తిరిగి తీసుకొచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. ప్రముఖ నటుడు శివాజీ సతం ACP ప్రద్యుమన్ పాత్రను పోషించారు. 1500 పైగా ఎపిసోడ్లలో తన నటనతో ఆకట్టుకున్నారు. 

 cinema-news | latest-news | ACP Pradyuman | Shivaji Satam

Also Read: మా అక్క అందుకే తిట్టింది.. అసలు నిజం ఇదే.. చిట్టి పికిల్స్ బూతులపై రమ్య సంచలన వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు