మా అక్క అందుకే తిట్టింది.. అసలు నిజం ఇదే.. చిట్టి పికిల్స్ బూతులపై రమ్య సంచలన వీడియో!

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై అలేఖ్య చెల్లి రమ్యా గోపాల్ కంచెర్ల క్లారిటీ ఇచ్చింది. తమ గురించి తప్పుగా మెసేజ్ చేసిన వేరే వ్యక్తిని తిట్టబోయి..అక్క మరో వ్యక్తిని తిట్టేసినట్లు తెలిపింది. ఆ తర్వాత అతడికి క్షమాపణలు కూడా చెప్పామని వీడియో రిలీజ్ చేసింది చెల్లి రమ్య.

New Update

Also Read: Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో!

అందుకే మా అక్క అలా తిట్టింది.. 

వివాదంపై అలేఖ్య చెల్లి రమ్య మాట్లాడుతూ.. ''పికిల్స్ వెబ్ సైట్ లో మేము రోజూ వందల మెసేజ్ లు మేనేజ్ చేస్తాము. వాటిలో చాలా వరకు బూతు మెసేజ్ లే వస్తుంటాయి. కొన్నింటిని బ్లాక్ చేస్తాము.. కానీ  కొన్నింటికి ఫ్రస్ట్రేషన్‌లో రిప్లై పెడతాం. అలా ఈ ఇష్యూలో  తప్పుగా మెసేజ్ చేసిన వేరే వ్యక్తిని తిట్టబోయి.. మా అక్క మరో వ్యక్తిని తిట్టింది. ఆ తర్వాత వెంటనే రియలైజ్ అయ్యాక మెసేజ్ డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆయన దానిని చూడడంతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పెద్ద ఇష్యుగా మారిందని'' క్లారిటీ ఇచ్చింది. తప్పుగా మాట్లాడిన వారికి తాము కూడా అదే విధంగా రిప్లై ఇస్తామని,  ఇన్నోసెంట్ కస్టమర్స్ తో తాము ఎప్పుడూ అలా ప్రవర్తించమని వివరణ ఇచ్చింది. అలాగే పొరపాటున తిట్టిన అతడికి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపింది అలేఖ్య చెల్లి రమ్య. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు