Tunnel Movie: తెలుగు రిలీజ్ కు సిద్దమైన తమిళ్ సూపర్ హిట్ 'టన్నెల్'..

తమిళంలో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ 'టన్నెల్' ఇప్పుడు సెప్టెంబర్ 19న తెలుగులో విడుదల కానుంది. అథర్వా మురళి, లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. యాక్షన్, సస్పెన్స్, మెసేజ్‌తో థియేటర్లలో థ్రిల్లింగ్ అందించబోతోంది.

New Update
Tunnel Movie

Tunnel Movie

Tunnel Movie: ఇటీవల తమిళంలో సూపర్ సక్సెస్ కొట్టిన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా 'టన్నెల్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 19న రాబోతోంది. తమిళంలో మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకోవాలని మూవీ టీమ్ ఆశిస్తోంది.

ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. కథలో థ్రిల్, ఎమోషన్స్ అన్నీ కలిపి అద్భుతంగా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

Also Read:Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!

అథర్వా మురళి ఈ సినిమాలో హీరోగా నటించగా, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. వీరి కాంబినేషన్ కి తమిళ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే మ్యాజిక్ తెలుగు వెర్షన్‌లో కూడా రాబోతుంది. ఈ సినిమాలో అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అతని పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

తెలుగులో ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. రాజు నాయక్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌లో యాక్షన్, థ్రిల్, సస్పెన్స్, గ్రిప్పింగ్ నేరేషన్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Also Read: Neha Shetty: హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చేక్కిస్తున్న డిజే టిల్లు బ్యూటీ.. కిక్కించే ఫొటోలు చూశారా?

U/A సర్టిఫికేట్..

ఇక సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యులు సినిమా కథ, సీన్స్ గురించి ప్రశంసలు కురిపించారు. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను బోర్ అనిపించకుండా ఉంచడమే కాదు, మంచి మెసేజ్‌ను కూడా అందించగలిగిందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయి. ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉండేలా తీర్చిదిద్దారని చెబుతున్నారు. సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను శక్తి శరవణన్ చేపట్టారు. ఎడిటింగ్ కలైవానన్ చేశారు.

ఈ కథలోని మిస్టరీ ఎలిమెంట్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని టీమ్ చెబుతోంది. తమిళంలో లాగానే ఈ కంటెంట్ తెలుగులో కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఆశిస్తున్నారు మూవీ టీమ్.

‘టన్నెల్’ సినిమా ఒక మంచి కథ, మంచి టెక్నికల్ టీమ్, ఆకట్టుకునే నటులతో రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను మిస్ అవ్వకండి. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వారికి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ కావడం ఖాయం.

Advertisment
తాజా కథనాలు