Cinema: కార్తీ సినిమా మీద నాగార్జున ప్రశంసల వర్షం

కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం–సుందరం సినిమా గత వారం రిలీజ్ అయింది. సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ..అంతే కామ్‌గా అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా దీని గురించి ట్వీట్ చేశారు.  సినిమాను పొగడ్తల్లో ముంచేశారు.

New Update
cinema

Nagarjuna Tweet on Satyam-Sundaram Movie: 

తమిళ హీరోలు సూర్య, కార్తీలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ఇద్దరినీ తెలుగు వాళ్ళు కూడా బాగా ఓన్ చేసుకుంటారు. దాదాపు ఈ ఇద్దరి అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అంతే హిట్ కూడా కొడతాయి. అందులో కార్తీ అంటే ఇంకా అభిమానం కురిపిస్తారు. ఇతను డైరెక్టుగా కూడా నాగార్జునతో కలిపి ఒక సినిమా చేశాడు. చక్కగా తెలుగులో మాట్లాడతాడు. కార్తీ ఎంచుకునే సినిమాలు కూడా మంచి కథతో ఉండి అందరినీ ఆకర్షిస్తాయి. తాజాగా కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సత్యం–సుందరం సినిమా గత శుక్రవారం రిలీజ్ అయింది. ఒకపక్క ఎన్టీయార్ సినిమా దేవర ప్రభంజనం సృష్టిస్తున్నా..కార్తీ సినిమా ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. సెన్సిబుల్ కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 

తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు. కార్తీని తమ్ముడుగా భావించే నాగ్...అతనిని ట్యా చేస్తూ సత్యం–సుందరం సినిమా మీద పొగడ్తల వర్షం కురిపించారు. సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నానని..సినిమా అయిపోయాక కూడా తన మొహం మీద ఆ నవ్వు చెరగలేదని చెప్పారు. తన చిన్నప్పటి ఎన్నో గుర్తులను సత్యం–సుందరం సినిమా గుర్తు చేసిందని చెప్పుకొచ్చారు నాగార్జున. ఈ సినిమా మీద మంచి రివ్యూలు వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.  కార్తీకి, మొత్తం టీమ్‌కు కంగ్రాచ్చులేషన్స్ తెలిపారు. 

 

Also Read: బెయిల్ కోసం ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు