/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Breaking-CBN-.jpg)
AR Dairy Raja Sekharan:
తిరుపతి లడ్డూకు (Tirupati Laddu) కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణలు ఎంత వివాదం సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా దీని మీద దుమారం చెలరేగింది. దీంతో ఈ చర్యలకు పాల్పడ్డ వారందరి మీద కేసులు నమోదు చేసింది ఏపీ గవర్నమెంటు. ఇందులో భాగంగా లడ్డూల కోసం నెయ్యి సప్లై చేసిన ఏ ఆర్ డెయిరీ మీద కూడా కేసు నమోదు అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుల విషయంలో ఏ ఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుతో పాటు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టును రాజశేఖరన్ కోర్టును అభ్యర్ధించినట్టు తెలుస్తోంది.
నెయ్యి శాంపిల్స్ సేకరణ జరిపి దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ చట్ట నిబందనలు అనుసరించలేదని ఏఆర్ డెయిరీ ఎండీ పిటిషన్‌లో పేర్కన్నారు. దాంతో పాటూ నెయ్యి కల్తీ ఆరోపణలపై తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం అని ఆయన అంటున్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని.. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని రాజశేఖరన్ ఆరోపిస్తున్నారు.
ఈ కారణంగా తనను పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాని కోసం కోర్టు ఎలాంటి షరత్తులు విధించిన కట్టుబడి ఉంటానని ఏఆర్ డెయిరీ ఎండీ చెప్పారు. ఈ పిటిషన్ ఏపీ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: స్టార్ బ్యాటర్ మరో రికార్డ్..27వేల పరుగుల ఖాతాలో సచిన్ తర్వాత..