Cinema News: పవన్ సినిమా ఆపే దమ్ముందా.? నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల వివాదం నేపథ్యంలో జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ ఈ వార్తలను ఖండించారు. మరోవైపు నిర్మాత నట్టి కుమార్ పవన్ సినిమా ఆపే దమ్ముందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update

Cinema News:   ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఎగ్జిబిటర్లు సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు అంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రెంటల్ విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సంటేజ్ సిస్టంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, నిర్మాతలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. 

ఛాంబర్ సెక్రెటరీ  దామోదర్ ప్రసాద్

అయితే ఈ వివాదం నేపథ్యంలో  తెలుగు రాష్ట్రాల్లోని  ఎగ్జిబిటర్లు అంతా కలిసి జూన్ 1నుంచి థియేటర్లు  మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్   హరిహర వీరమల్లు,  కమల్ హాసన్ తగ్ లైఫ్ చిత్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరిగింది. ఈ క్రమంలో  తాజాగా ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ  దామోదర్ ప్రసాద్ దీనిపై స్పందించారు. 

జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేత అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. నిన్న జరిగిన మీటింగ్ లో కేవలం పర్సంటేజ్ విషయం గురించే చర్చ జరిగిందని తెలిపారు. ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ కు తమ నిర్ణయాన్ని తెలియజేశారని.. ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయాన్నీ నిర్మాతల మండలి కి తెలియజేసిందని వెల్లడించారు. త్వరలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

Also Read: Cinema: లవ్ స్టోరీతో ఘట్టమనేని యంగ్ హీరో అరంగేట్రం.. ఫస్ట్ సినిమాకే టాప్ బ్యానర్

మూసే దమ్ము ఉందా

మరోవైపు నిర్మాత,డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్.. జూన్ ఒకటవ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత అంటూ వస్తున్న వార్తలు హాస్యాస్పదం అని అన్నారు. గత మూడు నెలలుగా సినిమాలు లేక ఖాళీగా ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు మాట్లాడటం వెనుక మతలబ్ ఏంటి? అని ప్రశ్నించారు.  ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు? జూన్ లో వస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని ప్రదర్శించకుండా థియేటర్ల మూసే దమ్ము ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 latest-news | cinema-news | telugu-cinema-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు