Jaya Krishna Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూడవ జనరేషన్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని అరంగేట్రానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జయ కృష్ణ యునైటెడ్ స్టేట్స్‌లోని యాక్టింగ్ కోర్సు కూడా పూర్తి చేశారట. అక్కడ నటనకు అవసరమైన నైపుణ్యాలను, మెళకువలను నేర్చుకున్నాడు.
@AshwiniDuttCh Producer
— SSMBROYALFAN (@SSMBROYALFAN2) May 6, 2025
Ghattamaneni Jaya kirshna Hero #AjayBhupathi director
Action & Love story
ALL The Best @JKGhatPM 👍 @VyjayanthiFilms#SSMB29https://t.co/d5d4X5OhdZpic.twitter.com/VtAsF1E0TR
వైజయంతి ఫిలిమ్స్ నిర్మాణంలో
ఘట్టమనేని కుటుంబం త్వరలోనే జయకృష్ణ హీరోగా కొత్త కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి 'RX 1100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. ఇటీవలే జయకృష్ణ సినిమాకు సంబంధించిన ఫొటో షూట్ లో కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/05/19/mgpRd0j5X4rO5SXRH5i5.png)
cinema-news | telugu-news | latest-news mahesh babu