Subabraju: కృష్ణవంశీ డైరెక్షన్ లో 2003లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ఖడ్గం'లో చిన్న పాత్రలో కనిపించడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుబ్బరాజు. ఆ తరువాత మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్లి ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్న సుబ్బరాజు అదే ఏడాది 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలోనూ నటించడంతో మంచి గుర్తింపు లభించింది.
Also Read: BREAKING: కాంగ్రెస్ నేత హనుమంతరావు కారుపై రాళ్ల దాడి!
ఆ తరువాత పూరి జగన్నాధ్ సినిమాతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడంతో ఇండస్ట్రీలో మంచి స్టార్ గా ఎదిగాడు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుబ్బరాజు పోషించిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేసి మెప్పించాడు.
Also Read: Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ!
47 ఏళ్ల వయసులో..
అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు తాజాగా 47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యాడు.ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని చెప్పిన సుబ్బరాజు ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు.వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లుగా సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోను షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు. సుబ్బరాజు పెళ్లి గురించి ఎలాంటి హడావుడి, రూమార్లకు తావు లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్నారు. ఆయన పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read: AP : తీవ్ర వాయుగుండం..ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
సోషల్ మీడియా ద్వారా వెన్నెల కిషోర్‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బరాజు పెళ్లి చేసుకున్న వధువుకు సంబంధించిన విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తున్నారు.చుట్టాల అమ్మాయి అని ప్రచారం సాగుతోంది. సుబ్బరాజు ఫ్రెండ్ అని కొందరు.. కాదు ఇండస్ట్రీకి చెందిన యువతి అని మరికొందరు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Chhattisgarh: 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం..నలుగురు ఉపాధ్యాయులు అరెస్ట్
సుబ్బరాజు పెళ్లి ఫోటోను షేర్ చేశారు కానీ వధువుకు సంబంధించిన విషయాలను షేర్ చేయలేదు. పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి.