దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి..

దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్‌లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి.

this week movies
New Update

ప్రతి వారం మాదిరిగానే మరో వారం వచ్చేసింది. ఈ వారం ఎలాంటి సినిమాలు థియేటర్‌, ఓటీటీలోకి వస్తాయో? అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

థియేటర్ సినిమాలు

వేట్టయాన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా ‘వేట్టయాన్’. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘జై భీమ్’ ఫేం టీ.జే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

విశ్వం

మ్యాచోస్టార్ గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘విశ్వం’. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ప్యాక్డ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. 

ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా

మార్టిన్

ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మార్టిన్’. పి.పి. అర్జున్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో వైభవి శాండిల్య హీరోయిన్‌గా నటిస్తుంది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.  

జిగ్రా

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాతల్లో నటిస్తున్న సినిమా ‘జిగ్రా’. వాసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి రిలీజ్ చేస్తున్నాడు. 

మా నాన్న సూపర్ హీరో

సుధీర్ బాబు మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్11న రిలీజ్ కానుంది. 

జనక అయితే గనక

సుహాస్ పలు హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘జనక అయితే గనక’ మూవీ చేస్తు్న్నాడు. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. 

ఓటీటీ చిత్రాలు / సిరీస్‌లు

అక్టోబర్ 7 - ది మెహండెజ్ బ్రదర్స్ (క్రైమ్ డాక్యుమెంటరీ)
అక్టోబర్ 8 - యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) 
అక్టోబర్ 9 - స్టార్టింగ్ 5 - (వెబ్ సిరీస్)
అక్టోబర్ 9 - ఖేల్ ఖేల్ మే (హిందీ మూవీ)
అక్టోబర్ 10 - ఔటర్ బ్యాంక్స్ సీజన్ - 4 పార్ట్ -1 (సిరీస్)
అక్టోబర్ 10 -  టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ సిరీస్)
అక్టోబర్ 10 - మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్)
అక్టోబర్ 10 - గర్ల్ హాంట్స్ బాయ్ 
అక్టోబర్ 11 - అప్‌ రైజింగ్ (కొరియన్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 11 - లోన్‌లి ప్లానెట్
అక్టోబర్ 12 - ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో)

ఇది కూడా చదవండి: 'పవన్ కళ్యాణ్‌కు ఇది చెప్పాలనుకుంటున్నా'? షాయాజీ షిండే కామెంట్స్

ఆహా

అక్టోబర్ 11 - గొర్రె పురాణం (తెలుగు మూవీ) - రూమర్ డేట్
అక్టోబర్ 11 - లెవెల్ క్రాస్ (మలయాళ మూవీ) - రూమర్ డేట్

సోనీ లివ్

అక్టోబర్ 11 - రాత్ జవాన్ హై (హిందీ సిరీస్)
అక్టోబర్ 11 - జై మహేంద్రన్ (మలయాళం)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

అక్టోబర్ 11 - వారై (తమిళ మూవీ)
అక్టోబర్ 11 - సర్ఫీరా (బాలీవుడ్ మూవీ)

అమెజాన్ ప్రైమ్ వీడియో

అక్టోబర్ 10 - సిటాడెల్: డయానా

జియో సినిమా

అక్టోబర్ 11 - టీకప్ (హాలీవుడ్)
అక్టోబర్ 11 - గుటర్ గూ (హిందీ)

#tollywood #ott #telugu-movie-news #theatre
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe