OTT Movies: ఓటీటీలో వినోదాల విందు.. ఈ వారం 20కి పైగా సినిమాలు, సీరీస్ లు! ఫుల్ లిస్ట్ ఇదే

కొత్త వీకెండ్ కోసం కొత్త సినిమాలు వచ్చేశాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి. 

New Update
this ott movies list

this ott movies list

OTT  Movies:  కొత్త వీకెండ్ కోసం కొత్త సినిమాలు వచ్చేశాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి. 

ఈ వారం ఓటీటీ సినిమాలు 

'తలైవా తలైవి'

విజయ్ సేతుపతి- నిత్యామీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'తలైవా తలైవి' ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఈ చిత్రాన్ని  'సర్ మేడం' పేరుతో విడుదల చేశారు. గతనెల 25న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో యోగిబాబు, రోషిని హరిప్రియన్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.   

‘అంధేరా’

క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికోసం ‘అంధేరా’ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ రాఘవ్‌ ధర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో కరణ్‌వీర్‌ మల్హోత్రా, ప్రియా బాపట్‌, సుర్వీన్‌ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. 

'జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో  ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ చిత్రం ఆగస్టు 15 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలకు ముందు ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై  సెన్సార్ బోర్డు  అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఎట్టకేలకు జులై 17న థియేటర్స్ లో విడుదలైంది.

Also Read: Kriti Sanon: వావ్! సముద్రం పక్కనే కృతి కొత్త ప్యాలెస్ .. ధర తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు.. 

  • సూపర్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 15 

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు.. 

  • సాంగ్స్ ఫ్రమ్ ది హోల్(మూవీ)
  • ఫిక్స్డ్  
  • రోల్ మోడల్స్

  • అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్) 

  • మిస్ గవర్నర్- (సీజన్-1)

  • ఫిట్ ఫర్ టీవీ 

  • సెల్ఫ్ రిలయన్స్

  • లవ్ ఈజ్ బ్లైండ్ యూకే

  • ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ 

  • ద నైట్ ఆల్వేస్ కమ్స్ 

  • మా(హిందీ మూవీ)

జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు 

  • బ్యూటీఫుల్ డిజాస్టర్- ఆగస్టు 15

  • ఏలియన్ ఎర్త్- ఆగస్టు 15

  • బ్లడీ ట్రోఫీ  - ఆగస్టు 17
  • కృష్ణ కో లవ్ స్టోరీ - ఆగస్టు 15

  • మోజావే డైమండ్స్ - ఆగస్టు 15

  • లిమిట్‌లెస్ - ఆగస్టు 15

సన్‌ నెక్స్ట్

  • గ్యాంబ్లర్స్ -  ఆగస్టు 15

  • అక్కేనామ్ - ఆగస్టు 15

  • గుడ్ డే - ఆగస్టు-15

 Also Read: Rachita Ram: ముఖం చూసి అమాయకురాలు అనుకున్నాం కదరా..! 'కూలీ' విలన్ రచిత రామ్ గురించి తెలిస్తే..

Advertisment
తాజా కథనాలు