Kriti Sanon: వావ్! సముద్రం పక్కనే కృతి కొత్త ప్యాలెస్ .. ధర తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

కృతి సనన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ. 78 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బాంద్రా వెస్ట్ లోని 'సుప్రీం ప్రాణా' అనే రెసిడెన్షియల్ టవర్ లో 14, 15వ అంతస్థులో విస్తరించి ఉన్న సీ ఫేసింగ్  డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్ తీసుకున్నారు

New Update
Bollywood Actress Kriti Sanon

Bollywood Actress Kriti Sanon

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ. 78 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బాంద్రా వెస్ట్ లోని 'సుప్రీం ప్రాణా' అనే రెసిడెన్షియల్ టవర్ లో 14, 15వ అంతస్థులో విస్తరించి ఉన్న సీ ఫేసింగ్  డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్ తీసుకున్నారు. ఈ పెంట్ హౌస్ మొత్తం 6, 636 స్క్వేర్ ఫీట్ ఉంటుందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు దీనికి అదనంగా 1,209 చదరపు అడుగుల ఓపెన్ టెర్రస్, కార్ పార్కింగ్ స్థలం కూడా ఉంది.  ఒక చదరపు అడుగు విలువ రూ. రూ. 1.18 లక్షలు ఉండగా.. మొత్తం రూ. 78 కోట్లు పెట్టి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు కృతి! ఇందులో స్టాంప్ డ్యూటీ కోసం రూ. 3.91 కోట్లు చెల్లించారు.   జీఎస్టీ, ఇతర చార్జీలతో కలిపి మొత్తం రూ. 84. 16 కోట్లకు పైగా ఈ ఆస్తి విలువ ఉంటుందని సమాచారం. 14, 15వ అంతస్థులో కృతి కొన్న ఈ ఇంటి నుంచి అరేబియా సముద్రం అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. 

గతంలోనూ.. 

ఇదిలా ఉంటే కృతి ఇలాంటి ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో ముంబైకి సంపంలోని అలీబాగ్ లో 2,000 స్క్వేర్ ఫీట్  స్థలాన్ని కొనుగోలు చేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా  ఇక్కడ స్థలాన్ని కొన్నారు. అలాగే 2024లో బాంద్రా వెస్ట్‌లో రూ. 35 కోట్ల విలువ చేసే  4-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను కూడా సొంతం చేసుకుంది. ముంబైలో బాంద్రా వెస్ట్ ఏరియా చాలా ఖరీదైన ప్రాంతం. ఇక్కడ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, జావేద్ అక్తర్, రేఖ వంటి బాలీవుడ్ స్టార్స్ నివసిస్తున్నారు. త్వరలోనే దీపికా- రణ్వీర్ దంపతులు ఇక్కడికి షిఫ్ట్  అవ్వనున్నట్లు తెలుస్తోంది. 

 ఇక కృతి సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందిలో ధనుష్ సరసన తేరే ఇష్క్ మే సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ 28న విడుదల కానున్నట్లు సమాచారం. నెక్స్ట్ షాహిద్ కపూర్ తో కలిసి 'కాక్ టెయిల్-2' చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కృతి తెలుగులో కూడా పలు స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె కేరీర్ మొదలైంది కూడా టాలీవుడ్ లోనే . మహేష్ బాబు నేనొక్కడినే సినిమతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'దోచేయ్',  ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమాలలో నటించింది. ఆది పురుష్ సినిమాలో సీత దేవి పాత్రలో ఆకట్టుకుంది కృతి. 

హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా అడుగులు వేసింది కృతి. ఇటీవలే విడుదలైన 'దో పత్తి' సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ఫొటో షూట్లు షేర్ చేస్తుంటుంది.

Also Read: Vivek Agnihotri : వెస్ట్ బెంగాల్ మరో న్యూ కశ్మీర్ గా మారుతోంది.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలనం!

Advertisment
తాజా కథనాలు