Diwali OTT and Theater Releases: మూవీ లవర్స్ గెట్ రెడీ..! ఈ వారం థియేటర్, ఓటీటీలలో బోలెడు సినిమాలు..

ఈ దీపావళి సందర్బంగా థియేటర్లలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఓటీటీల్లో కిష్కిందపురి, భగవత్, ఆనందలహరి, పరమ్ సుందరి, గుడ్‌న్యూస్ లాంటి కంటెంట్ అందుబాటులోకి రానుంది.

New Update
Diwali OTT and Theater Releases

Diwali OTT and Theater Releases

Diwali OTT and Theater Releases: ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులకు సినిమా సందడి రెట్టింపు కాబోతుంది. థియేటర్లలో నవ్వులు, ప్రేమ, స్నేహంతో కూడిన చిత్రాలు విడుదలవుతుండగా... ఓటీటీ వేదికలపై కూడా ఫ్రెష్ కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. ఈ ఏడాది దీపావళి వారంలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం!

Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు:

1. మిత్రమండలి (Mithra Mandali) – అక్టోబర్ 16

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్రెండ్‌షిప్ కామెడీ డ్రామా ఇది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, భావోద్వేగాలు ని చూపిస్తూ దర్శకుడు విజయేందర్ ఎస్. తెరకెక్కించారు.

2. తెలుసు కదా (Telusu Kada) – అక్టోబర్ 17

నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తీసిన మొదటి సినిమా. సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది త్రి యాంగిల్ ప్రేమకథ, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ డ్రామాగా రూపొందింది.

3. డ్యూడ్ (Dude) – అక్టోబర్ 17

కోలీవుడ్‌ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ 'డ్యూడ్' సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. మమితా బైజు హీరోయిన్. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు కీర్తీశ్వరన్.

4. కె-ర్యాంప్ (K-Ramp) – అక్టోబర్ 18

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో యుక్తీ తారేజా కథానాయికగా కనిపించనుంది. నరేశ్, సాయికుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు.

Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

ఓటీటీలో రానున్న సినిమాలు & వెబ్‌సిరీస్‌లు:

ZEE5:

కిష్కిందపురి – అక్టోబర్ 17

భగవత్ (సిరీస్) – అక్టోబర్ 17

Aha:

ఆనందలహరి (సిరీస్) – అక్టోబర్ 17

Amazon Prime Video:

పరమ్ సుందరి – స్ట్రీమింగ్‌లో ఉంది (రెంట్ పై లభ్యం)

Netflix:

ది డిప్లొమ్యాట్ సీజన్ 3 – అక్టోబర్ 16

గుడ్‌న్యూస్ – అక్టోబర్ 17

Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్

ఈ దీపావళికి అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా వినోదం అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో ఫ్రెండ్‌షిప్, ప్రేమ, కామెడీ సినిమాలు అలరించబోతుండగా, ఓటీటీలో సిరీస్‌లు, స్పెషల్ సినిమాలు ముస్తాబవుతున్నాయి. కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి మంచి అవకాశం ఇది!

Advertisment
తాజా కథనాలు