జలియన్ వాలాబాగ్ హత్యాకాండ వెనుక కుట్ర ఏంటి? 'ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌' ట్రైలర్

జాతీయ అవార్డు గ్రహీత రామ్ మధ్వానీ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’. అయితే తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ వెనుక ఉన్న కుట్రను వెలికితీసే నేపథ్యంలో సిరీస్ రూపొందింది.

New Update

The Waking of a Nation:  ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ రామ్ మధ్వానీ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పుకునే జలియన్ వాలాబాగ్ మారణహోమం చుట్టూ జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సీరీస్ రూపొందింది. మార్చి 7నుంచి ఈ హిస్టారికల్ డ్రామా సోనీలివ్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై స్ట్రీమింగ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

Also Read: Lakshmi Manchu: మంచు లక్ష్మి విడాకులు.. తండ్రి దగ్గరకు వెళ్లిపోయిన కూతురు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

‘ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’

1919లో జలియన్ వాలాబాగ్ హత్యాకాండ వెనుక ఉన్న కుట్రను వెలికితీసే నేపథ్యంలో సీరీస్ సాగుతుంది. హత్య వెనుక ఉన్న చీకటి కోణాన్ని వెలికితీసే లాయర్ కాంతిలాల్ సాహ్ని పాత్రను నటుడు తారుక్ రైనా పోషించారు. లాయర్ కాంతిలాల్ జలియన్ వాలాబాగ్ హత్యకాండ వెనుక ఉన్న కుట్రను ఎలా బయటపెట్టారు? ఆ క్రమంలో అయన ఎదుర్కున్న సవాళ్లేంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో ఈ సీరీస్ అందుబాటులోకి రానుంది.

Also Read: Hara Hara Veera Mallu: డాన్స్ తో అదరగొట్టిన పవర్ స్టార్.. 'కొల్లగొట్టినాదిరో' ఫుల్ సాంగ్ వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు