Thandel Piracy: తండేల్ కి తప్పని తిప్పలు.. మరోసారి ఏపీ ఆర్టీసీ బస్సులో పైరసీ స్క్రీనింగ్

ఏపీఆర్టీసీ బస్సుల్లో మరోసారి 'తండేల్' పైరసీ ప్రదర్శించినట్లు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో పైరసీ ఫుటేజ్ లను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణను కోరారు.

New Update
THANDEL hd print

THANDEL hd print

Thandel Piracy: తండేల్ నిర్మాతలు ఇప్పటికే  'పైరసీ' ఫుటేజ్ లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. మరో సారి  ఏపీఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమా ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు స్వయంగా తెలియజేశారు. మరోసారి తండేల్ పైరేటెడ్ వెర్షన్ బస్సులు ప్లే చేసినట్లు ట్వీట్ చేశారు. పైరసీ వల్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రియేటర్ల కష్టాన్ని ఇలా అగౌరపరచొద్దని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సులలో పైరేటెడ్ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ కఠినమైన సర్క్యులర్ జారీ చేయాలని ఏపీ ఆర్టీసీ ఛైర్మెన్ కొనకళ్ళ నారాయణను కోరారు. 

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి 

నాగ చైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫిబ్రవరి 7న విడుదలైన 'తండేల్' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలోని మ్యూజిక్,  చైతన్య-  సాయి పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 4 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ దాటేసి లాభాల బాటలో దూసుకెళ్తోంది. 

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు