/rtv/media/media_files/2025/09/28/og-ost-2025-09-28-15-08-11.jpg)
OG OST
OG OST: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా OG (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, త్వరలోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను తాకే అవకాశం ఉంది.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
#Thaman has revealed that the #OG original soundtrack (OST) will be released around the Diwali festival. pic.twitter.com/DdKvq5LJO8
— Cinema Mania (@ursniresh) September 28, 2025
అయితే, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. OG సినిమాకు ఆయన అందించిన బీజీఎం (Background Score) కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ బీజీఎం లతో కూడిన అసలు మ్యూజిక్ ట్రాక్స్ (OST - Original Soundtrack) ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తమన్ తెలిపారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
తమన్ కంపోజ్ చేసిన స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీలతో పాటు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌కి పూనకాలే తెచ్చింది. దీంతో ఆ మ్యూజిక్‌ను మళ్లీ వినాలన్న ఆత్రుత ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. దీపావళి పండుగకు OST రిలీజ్ అయితే, మరోసారి OG మ్యూజిక్ సందడి చేయనుంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
సినిమా విషయానికి వస్తే, OGలో ఇమ్రాన్ హాష్మీ విలన్ పాత్రలో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు.
మొత్తానికి, సినిమా విజయం తర్వాత ఇప్పుడు 'OG' OST కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్ ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ మ్యూజిక్‌ను మళ్లీ వినేందుకు ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు!