/rtv/media/media_files/2025/07/26/anchor-anasuya-2025-07-26-14-05-24.jpg)
Anchor Anasuya
Anchor Anasuya: యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. తరచూ తన ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. కుమారులిద్దరినీ పచ్చని చెట్ల మధ్యలో కూర్చోబెట్టి.. నలుగుతో స్నానం చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మన పెద్దలు, పూర్వీకులు పాటించమని చెప్పే సంస్కృతి, సంప్రదాయాల అనుసరించడంలో అపరిమితమైన అందం, విలువ, సారాంశం మరియు అర్థం ఉంది. నేను పిల్లలు పుట్టిన మొదట్ల ఇలా స్నానం చేయించేదాన్ని.. మళ్ళీ అలా చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది అని ఆనందం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే ఇటీవలే అనసూయ తన కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది. తన కలల ఇంటికి 'శ్రీరామసంజీవని' అని పేరు కూడా పెట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకు ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇలా తన ఇంట వరుస శుభకార్యాలు జరుపుకుంది అనసూయ.
సినిమాలు, షోలు
ఇక అనసూయ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ.. నటిగా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమత్త పాత్ర అనసూయకు భారీ పాపులారిటీ తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అనసూయ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప' దాక్షాయణి పాత్రతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో 'కొల్లగొట్టినాదిరో' పాటలో తన గ్లామరస్ పర్ఫార్మెన్స్ తో అలరించింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ అవకాశాలు అందుకుంటుంది అనసూయ. తమిళ్లో ఫ్లాష్ బ్యాక్, వూల్ఫ్ సినిమాలు చేస్తోంది. ఇక బుల్లితెరపై జబర్దస్త్, డ్రామా జూనియర్స్, మోడ్రన్ మహాలక్ష్మి, కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్, ఢీ జోడీ వంటి పాపులర్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.