Tamannaah: తమన్నా ఈజ్ బ్యాక్.. సైజ్-జీరో లుక్‌ తో హీట్ పెంచేసిన మిల్కీ బ్యూటీ

తమన్నా బట్టియా సైజ్-జీరో లుక్ కోసం కసరత్తు చేస్తోంది. ఇటీవల తనపై ట్రోల్ల్స్ ఎదురైనప్పటికీ, వర్కౌట్స్‌ ద్వారా ఫిట్‌గా మారింది. త్వరలో కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకునే ప్లాన్‌లో ఉంది. నటిగా, స్పెషల్ సాంగ్స్‌ ద్వారా మంచి క్రేజ్‌ సంపాదిస్తోంది.

New Update
Tamannaah

Tamannaah

Tamannaah: 'మిల్కీ బ్యూటీ'గా పేరు పొందిన తమన్నా బట్టియా ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్ నుంచి సినిమాల వరకూ ఏ విషయమైనా సరే, ఈ స్టార్ హీరోయిన్ ఎప్పుడూ పాపులారిటీని అందుకుంటూనే ఉంది.

ఇటీవల ఆమె బరువు గురించి సోషల్ మీడియాలో కొంత నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే వాటికి తమన్నా తన స్టైల్‌లో సమాధానం చెప్పింది. రెగ్యులర్ వర్కౌట్స్, కఠినమైన డైట్ ఫాలో అవుతూ, తక్కువ రోజుల్లోనే తన బాడీను మళ్లీ టోన్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు తన లుక్‌ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో, సైజ్-జీరో ఫిజిక్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోందట.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

ఇంకా స్లిమ్‌గా, ఫిట్‌గా..

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఇంకా స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించేలా నా లుక్‌ను మార్చుకుంటున్నాను. నా కొత్త లుక్ తో అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నాను" అని చెప్పింది. ఈ మాటలు విని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

ఇక వెబ్ సిరీస్ ‘Do You Wanna Partner’లో చివరిసారిగా కనిపించిన తమన్నా లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరి సినిమాల్లో ఈ కొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

ఇక సినిమాల విషయానికి వస్తే, తమన్నా ప్రస్తుతం ‘‘రోమియో’’, ‘‘రేంజర్’’  ‘‘వివాన్’’ సినిమాలతో బిజీగా ఉంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, స్పెషల్ సాంగ్స్‌ లో కూడా సందడి చేస్తూ, రెండు వైపులా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేస్తే కెరీర్‌కు మైనస్ అవుతుందని అనేవాళ్లు. కానీ తమన్నా మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేసి, స్పెషల్ నంబర్స్‌ తో కూడా తనకు బంపర్ ఆఫర్స్‌ అందేలా చేసుకుంది.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

మొత్తానికి, తమన్నా ప్రస్తుతం ఫిట్‌నెస్, సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌ అన్నిట్లోను ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తోంది. సైజ్-జీరో కోసం చేస్తున్న ప్రయత్నం ఆమెకి కొత్త హైప్ తెచ్చిపెడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు

Advertisment
తాజా కథనాలు