Tamannaah: వరుస ఐటమ్ సాంగ్స్ తో దూసుకెళ్తున్న మిల్కీ బ్యూటీ..

తమన్నా స్పెషల్ సాంగ్స్‌తో, హీరోయిన్‌గా కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. షారూఖ్ కుమారుడు ఆర్యన్ డైరెక్ట్ చేస్తున్న వెబ్‌సిరీస్‌కి తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. సినిమాలు, పాటలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తమన్నా తన కెరీర్‌లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది.

New Update
Tamannaah

Tamannaah

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో హీరోయిన్ గా  నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌ తో ప్రేక్షకులను మెప్పిస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. ఓ స్టార్ హీరోయిన్‌ ఐటమ్ సాంగ్స్ చేస్తే కెరీర్‌కు నష్టం కలిగే అవకాశముంటుందని అందరూ అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు తమన్నా చేసే స్పెషల్ సాంగ్స్ ఆమెకు బంపరాఫర్స్‌ను తెస్తున్నాయి.

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

ఇటీవల ‘జైలర్’, ‘బోలే చుడియాన్’, ‘స్ట్రీ 2’, ‘రైడ్ 2’ వంటి సినిమాల్లో చేసిన పాటలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తొలిసారి డిజిటల్ స్క్రీన్‌పై కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌తో అలరించబోతోంది. షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ‘‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’’ వెబ్‌సిరీస్‌లో తమన్నా ఓ హాట్ నెంబర్ చేసింది. ఇది సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఒక సినిమా కోసం ఆరు నెలల సమయం వెచ్చించినా 4-5 కోట్ల రెమ్యూనరేషన్ వస్తే, ఓ స్పెషల్ సాంగ్‌ కోసం కేవలం కొన్ని రోజుల షూటింగ్‌తో 1-2 కోట్లు అందుకుంటోందట తమన్నా. అందుకే అలాంటి ఆఫర్లను వదులుకోకుండా, అందులోనూ తన గ్లామర్‌ అందాన్ని బాగా ఉపయోగించుకుంటోంది.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

ప్రస్తుతం తమన్నా చేతిలో ‘‘రొమియో’’, ‘‘రేంజర్’’, ‘‘వివాన్’’ సినిమాలు ఉన్నాయి. స్పెషల్ సాంగ్స్ చేస్తూనే కథానాయికగా అవకాశాలు అందుకోవడం ఆమెకు ప్లస్ అయింది. సినిమాల్లో నటిస్తూ, స్పెషల్ నంబర్స్‌తో జోరు కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ కెరీర్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు