/rtv/media/media_files/2025/02/22/e7rW878tNXq8uyMD45ng.jpg)
Odela 2 Censor
Odela 2 Censor: తమన్నా భాటియా కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ఓదెల 2’ పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఏప్రిల్ 17, 2025న థియేటర్లలో విడుదల కానుంది. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు ఏర్పడిపోయాయి.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
A సర్టిఫికేట్ పొందిన ‘ఓదెల 2’
తాజా సమాచారం ప్రకారం, సినిమా సెన్సార్ పూర్తయ్యింది. CBFC నుండి A సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి రన్‌టైమ్ మొత్తం 2 గంటలు 24 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది. 1st హాఫ్ 1 గంట 11 నిమిషాలు ఉంటే, 2nd హాఫ్ 1 గంట 13 నిమిషాలు సాగనుంది.
Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
సంపత్ నంది టీమ్‌వర్క్స్, మధు క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వసిష్ట ఎన్. సింహ, మురళీ శర్మ, శరత్ లోహితాశ్వ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కధకు బలంగా నిలవనుంది.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఈ కథలో తమన్నా పోషిస్తున్న శివశక్తి పాత్ర ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే, ‘ఓదెల 2’ ప్రేక్షకులకు ఒక డార్క్, ఇంటెన్స్ అనుభూతిని అందించనుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..