/rtv/media/media_files/2025/03/16/rfH4SZQiYrd252slldBo.jpg)
Retro Trailer Update
Retro Trailer Update: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’తో మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మే 1, 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
అయితే, ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అనుకున్నారు సినీ అభిమానులు. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇస్తూ ఇది యాక్షన్‌తో కూడిన ఓ ప్రేమకథ అని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రెట్రో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి,” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఏప్రిల్ 18న ట్రైలర్ రిలీజ్..
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవగా, థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.
చిత్రంలో శ్రియా శరణ్ ప్రత్యేక గీతంలో మెరవనుండగా, జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ పనిచేస్తున్నారు.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
‘రెట్రో’ మే 1న విడుదలై అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న HIT 3, రైడ్ 2 సినిమాలతో పోటీ పడనుంది. సూర్య అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న తరుణంలో, ఈ లవ్ – యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..