Retro Trailer: తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. కానీ గత కొన్నాళ్లుగా సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. అయితే, ఇప్పుడు ‘రెట్రో’ అనే సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, "బుజ్జమ్మ" అనే పాట సౌండ్‌ట్రాక్ ఎంతగానోఆకట్టుకుంతోంది.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
మే 1న ‘రెట్రో’ విడుదల
ఈ సినిమాలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఈ సినిమా మే 1న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
గత ఏడాది విడుదలైన ‘కంగువ’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే ఈసారి ‘రెట్రో’తో భారీ కమబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు సూర్యా. మరి 'రెట్రో' విజయం సాధిస్తుందో? లేదో? వేచి చూడాలి.