కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'కంగువ'. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14 ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
Also Read : కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. సర్కార్ ఫిక్స్ చేసిన డేట్ ఇదే!
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్య 'కంగువ' సినిమా కథ గురించి మాట్లాడారు. ఈ సినిమా యుద్ధం, కత్తుల కథాంశం మాత్రమే కాదని, ఎమోషన్స్ ను, శాంతిని తెలిపే కథాంశం అని అన్నారు. తనకు అన్ని ఫీలింగ్స్ కంటే ఈ ఫీలింగ్ పెద్దదని సినిమాపై మరింత హైప్ పెంచారు.
Also Read : నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్
రెండు టైమ్ లైన్స్ లో..
తాజా ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ..' ‘కంగువ’ 700 సంవత్సరాల క్రితం జరిగిన కథ.. 700 ఏళ్ల క్రితం 5 దీవుల్లోని తెగల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రం. రెండు టైమ్‌లైన్‌లలో జరుగుతుంది. అందులో ఒకటి 700 సంవత్సరాల క్రితం జరిగింది. రెండవది ఆధునిక కాలం నాటిది. ఈ రెండు టైం లైన్స్ ను డైరెక్టర్ శివ బాగా హ్యాండిల్ చేశారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ ప్లే చూసి మీకూ అదే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు అదే హైలైట్..' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : క్రికెటర్లు చూయింగ్ గమ్ ఎందుకు నములుతారో మీకు తెలుసా?
దీంతో సూర్య కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. 'యానిమల్' మూవీలో విలన్ గా ఆకట్టుకున్న బాబీ డియోల్ ఈ సినిమాతో మరోసారి విలన్ గా భయపెట్టనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?