రెండో సారి కూడా ఆ పని చేసే అమ్మాయితోనే డైరెక్టర్ క్రిష్ పెళ్లి..?

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా క్రిష్ రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు.

New Update
krish director

krish director

Director krish:  డైరెక్టర్ క్రిష్ గమ్యం, వేదం, కంచె వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'కొండపొలం' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన క్రిష్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్  అనుష్క శెట్టి  ప్రధాన పాత్రలో  ‘ఘాటి ‘అనే సినిమా చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇటీవలే అనౌన్స్ చేయడం జరిగింది. 'వేదం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. 

రెండో పెళ్ళికి సిద్దమైన క్రిష్ 

ఇది ఇలా ఉంటే డైరెక్ట్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఆమెకు కూడా ఇది రెండో వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు పెళ్లవగా.. భర్త నుంచి విడాకులు తీసుకున్నారని,  11ఏళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, క్రిష్ మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టర్. రమ్య అనే వైద్యురాలితో పెళ్లవగా .. కొన్నాళ్లకు  వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు.  

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?

Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు