/rtv/media/media_files/2025/05/18/5LGzFNlMd47OAcDguSWG.jpg)
Surekha Vani daughter Supritha hospitalized
Surekha Vani Daughter: నటి సురేఖ వాణి కూతురు సుప్రీత అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యింది. దిష్టి నిజమే! జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఈ వారం ఆలోచించేలా చేసింది! నేను శివయ్యను నమ్ముతాను.. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లుగా ఉంది. అయినా.. శివయ్య, నా అమ్మ, ప్రసన్న, రమణ లేకుండా నేను శూన్యం. 'దిష్టి' ఎల్లప్పుడూ ఈ భూమిపై నా ఉనికిని పరీక్షించేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యానికి.. మానసిక ఆరోగ్యం ఎల్లప్పుడూ ముఖ్యం అంటూ రాసుకొచ్చింది సుప్రీత. దీంతో ఆమె ఫాలోవర్లు.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సుప్రీత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తుంది. తరచూ తన అమ్మతో రీల్స్, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అడపాదడపా సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/04/25/GeiZLlhY9qRRH2HN3Nbm.jpg)
హీరోయిన్ గా ఎంట్రీ
ఇదిలా ఉంటే .. త్వరలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్- సుప్రీత హీరో హీరోయిన్లుగా గతేడాది సినిమాను అనౌన్స్ చేశారు. M3 మీడియా బ్యానర్ లో మహేంద్రనాథ్ కొండ్ల ఈ మూవీని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా అయితే అనౌన్స్ చేశారు.. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
telugu-news | cinema-news | latest-news | actress-surekha-vani