Surekha Vani: సారీ చెప్పాక ఇంకేంటి.. బెట్టింగ్ యాప్స్ పై సురేఖావాణి ఆడియో వైరల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ప్రశ్నించినందుకు నటి సురేఖవాణి దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఓ యాంకర్ అడగ్గా.. అందుకే కదా సారీ చెప్పింది అంటూ సురేఖ వాణి విసుక్కుంది. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
actress surekha vani

actress surekha vani

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖవాణి  కూతురు సుప్రీత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే సారీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ యాంకర్ సురేఖవాణిని బెట్టింగ్ యాప్స్ గురించి ప్రశ్నించగా.. ఆమె దురుసుగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ''బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేయమని ఎవరు అప్రోచ్‌ అయ్యారు?'' అని యాంకర్  ప్రశ్నించగా.. ''మేము బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేయలేదమ్మా.. వాళ్ల పోస్టులను రీపోస్ట్‌ చేయమంటే చేశాము అంతే'' అని సమాధానమిచ్చింది. దీంతో యాంకర్.. ''అలా పోస్టులో ఏముందో తెలుసుకోకుండా రీపోస్ట్‌ చేయొద్దు కదా?'' అని అడగ్గా..  ''అందుకే కదా సారీ చెప్పింది'' అంటూ  విసుక్కుంది సురేఖావాణి. 

ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలెబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. స్టార్ హీరోల నుంచు సామాన్యల వరకు ఎవరినీ వదిలిపెట్టడంలేదు. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదు చేస్తున్నారు. హీరో రానా, విజయ దేవరకొండలపై కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ ఆరోపణలు వచ్చాయి.  ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియతో పాటు మరో 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

విచారణకు హాజరైన విష్ణుప్రియ

ఈ నేపథ్యంలో యాంకర్  విష్ణుప్రియ ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు. వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బలమైన ప్రూఫ్స్‌ ఉండడంతోనే విష్ణు ప్రియ ఫోన్ ను సీజ్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. 

Also Read: Shekar Master: నీ భార్యతో ఇలానే చేయిస్తావా? శేఖర్ మాస్టర్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Advertisment
తాజా కథనాలు