Rajinikanth: పవన్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్ వైరల్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి  50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్ కి విషెష్ తెలియజేశారు. పవన్ ట్వీట్ కి స్పందిస్తూ రజినీకాంత్ కూడా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

New Update
Rajinikanth

Rajinikanth

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి  50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు, సినీతారలు తలైవాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా సూపర్ స్టార్ కి విషెష్ తెలియజేశారు. ఈ మేరకు  రజినీ పై తనకున్న అభిమానాన్ని తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు పవన్. స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కి శుభాకాంక్షలు! బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ రజినీ పేరు కనిపించగానే థియేటర్ అంతా ఏ విధంగా మారుమోగుతుందో.. ఎన్నో సార్లు చెన్నైలో చూశాను. తరలు మారుతున్న ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు! ఆస్థాయిలో అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజినీకాంత్ సినీ రంగంలో 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రజినీ కాంత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. 

Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్... కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి అరెస్ట్

Also Read:సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా

రజినీకాంత్ రిప్లై 

అయితే పవన్ ట్వీట్ కి స్పందిస్తూ రజినీకాంత్ కూడా నెట్టింట ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నా ప్రియమైన మిత్రుడు, పొలిటికల్ తుఫాన్(Political Toofan) పవన్ కళ్యాణ్ కి నా హ్యూదయపూర్వక శుభాకాంక్షలు! ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ప్రార్థిస్తున్నాను  అంటూ పవన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవలే విడుదలైన సూపర్ స్టార్  'కూలీ' బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. పలు నివేదికల ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా వసూల్లు సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమిళ్ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కూలీ నిలిచింది. ప్రపంచావ్యాప్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Advertisment
తాజా కథనాలు