Sunny Leone: కొత్త యాంగిల్ చూపించబోతున్న సన్నీ లియోన్.. అదిరిపోయే అప్‌డేట్

సన్నీ లియోనీ నిర్మాతగా అడుగుపెడుతోంది. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో వస్తున్న అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌కు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇది నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్టుతో తన కొత్త ప్రయాణం మొదలవుతుందని సన్నీ తెలిపారు.

New Update
Sunny Leone

Sunny Leone

Sunny Leone:హాట్ బ్యూటీ సన్నీ లియోన్..  బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ పేరు తెలియని వాళ్లుండరు ఇప్పటికే పలు సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో కూడా సన్నీకి ఫుల్ క్రేజ్ ఉంది. సినిమాల్లో ప్రత్యేక పాటలతో అభిమానులను ఉర్రుతలూగించే సన్నీ లియోనీ, ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలోకి అడుగుపెడుతోంది. ఈ సారి ఆమె నిర్మాతగా మారనుంది. బాలీవుడ్‌లో పేరుగాంచిన దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తున్న ఓ అంతర్జాతీయ స్థాయి వెబ్‌సిరీస్‌కి సన్నీ నిర్మాతగా(Sunny Leone New Web Series) వ్యవహరించనుంది.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ఇప్పటికే ఈ ప్రాజెక్టును సన్నీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఒక ఎమోషనల్ నోటుతో షేర్ చేసింది.

సన్నీ నిర్మాతగా వెబ్‌సిరీస్.. 

“ఈ వెబ్‌సిరీస్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. నేను స్క్రిప్ట్ వినగానే ఇది ఎంతో స్ఫూర్తినిచ్చే కథగా అనిపించింది. ఇలాంటి గొప్ప కథతో నిర్మాతగా నా కొత్త జర్నీ మొదలవడం చాలా ఆనందంగా ఉంది.”

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటుల ఎంపికతో పాటు, ఇతర సాంకేతిక అంశాలపై జట్టు తీవ్రంగా పని చేస్తోంది. ఈ సిరీస్‌కి అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్‌లో వాస్తవికత, సానుభూతి, గ్లోబల్ టచ్ ఉండేలా దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టుపై సన్నీ వ్యక్తిగతంగా చాలా ఆసక్తి చూపుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరకు గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సన్నీ, ఇప్పుడు ఓ సీరియస్ నిర్మాతగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

ఇప్పటికే ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తుండగా. అభిమానులు సన్నీ కొత్త నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మోత్వానే టేకింగ్‌తో పాటు, సన్నీ విజన్‌కి సరిపోయేలా ఈ వెబ్‌సిరీస్ రూపొందనుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

ఈ వెబ్‌సిరీస్ పూర్తిగా రూపొందిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్‌ ముందుకు రానుంది. సన్నీకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి నిర్మాతగా ఆమె తొలి ప్రాజెక్ట్ ఎంత విజయవంతమవుతుందో వేచి చూడాలి! 

Advertisment
తాజా కథనాలు