Jaat Movie ఓటీటీలోకి 'జాట్' ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సన్నీ డియోల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ జాట్ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హాక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

New Update

Jaat Movie  2023లో 'గదర్ 2' భారీ విజయం తర్వాత  బాలీవుడ్ పవర్‌హౌస్ పెర్ఫార్మర్ సన్నీ డియోల్ 2025లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్  'జాట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 

ఓటీటీ అప్డేట్ 

సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత  'జాట్' ను ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా  'జాట్' ఓటీటీ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హాక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ  మే ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 

telugu-news | latest-news | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు