Jaat Trailer: సౌత్ డైరెక్షన్.. నార్త్ యాక్షన్ - ‘జాట్’ ట్రైలర్ గూస్‌బంప్సే

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ మాస్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. సౌత్ మాస్, నార్త్ యాక్షన్ సినీప్రియుల్ని బాగా ఆకట్టుకుంటుంది.

New Update

టాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ హీరో కలిసి ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. బాలయ్య బాబు ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్‌తో ‘జాట్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో డియోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

రిలీజ్ డేట్ ఇదే

అదే సమయంలో వినీత్‌ కుమార్‌ సింగ్‌, రణదీప్‌ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఇంతలో మేకర్స్ మరో అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ హిందీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే ట్రైలర్‌లో తెలుగు బోర్డులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

(gopichand-malineni | sunny-deol | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు