టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఇతను పేరుకే తెలుగు హీరో కానీ తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడ దూసుకుపోతున్నాడు. నిజానికి టాలీవుడ్‌లో సందీప్ కిషన్ ను వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఇక్కడ అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలో మెరుస్తున్నాడు.
రీసెంట్ గా ధనుష్ 'రాయన్' లో ముత్తువేల్ రాయన్‌గా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సందీప్ కిషన్.. ఈ మధ్య దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో హీరోగా ఛాన్స్ అందుకున్నాడు. ఇక తాజగా ఈ హీరోకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
Actor Sundeep kishan and Varun Official on board for Coolie Rajinikanth Lokesh kanagaraj Movie pic.twitter.com/UDGV5Qtxch
— Hari Krishnan (@KrishnanHa71743) December 4, 2024
Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?
రజినీ సినిమాలో కీ రోల్..
తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ చేయబోతున్నారట. సినిమాలో అతను కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సందీప్ కిషన్ కి మంచి బాండింగ్ ఉంది.
#Coolie: SundeepKishan expected to Play an important role in the film🌟#LokeshKanagaraj has worked with #SundeepKishan in his Debut film Maanagaram 🤝💥#Rajinikanth | #LokeshKanagaraj | #Anirudh pic.twitter.com/VmuDZo3vSB
— RAM Kumar (@7a2475be20c0405) December 4, 2024
లోకేష్ ఫస్ట్ మూవీ 'మా నగరం' సందీప్ కిషనే హీరో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాలో సందీప్ కిషన్ నటిస్తుండటం విశేషం. కాగా త్వరలోనే సందీప్ కిషన్ రోల్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ